Friday, September 24, 2010

Poetry by Praveen Kumar

  • చేసిన సేవలు ఎంతో 'అమరం'
    ఎవరూ చేరని కీర్తి 'శిఖరం'
    మరచిపోదు మిము మా భావితరం
    అందుకే మీరొక సంకల్ప "కిశోరం"
  • సుతిమెత్తగా మది దోచే మృదు 'మురళీ' గానం
    మన వెంటే సాగే తన ప్రయాణం
    మొదలవుతుంది ఈ జ్ఞాన తృష్ణ
    మాతో ఉంటే "మురళీకృష్ణ"
  • మంచే మనిషిగా పంచే 'జ్ఞానం'
    చీకటిలో మినుగురుగా నీవై పయనిస్తే తొలగును 'అజ్ఞానం'
    పనిలో ఎరగదు మీనమేషం,
    ఆ వీరమేషం మన "రమేషం"
  • మనిషేమో నడిచొచ్చిన ధైర్యం
    మనసేమో అభినందన తీరం
    మాటల్లో అనుభవాల సారం
    మన మణిహారం "శివ కుమారం"
  • వెతికినా ఎపుడైనా ఎకడైనా, లేరేమో ఈ ధరియందు
    మాట కోమలం మదిలో స్థానం పదిలం
    తానే మనకొక వరం, సుమధురం మన "శ్రీధరం"
  • నిరర్థ సుఖముకి కోతలు పెట్టి
    అలసిన మెదడుకి పదునే పెట్టి
    దైవిక సారము లోతులు చెప్పే కృష్ణోవచనవశం "సురేశం"
  • ఎపుడూ అడిగిన చేసే సాయం
    తన ఆలోచనలో ఉందొక న్యాయం
    కార్యంలో తనే ముందు ఉంటూ లక్ష్యానికంకితం సదా "ఆంజనేయం"
  • మనసెంతో సుకుమారం మాటేంతో మధురం
    అలలెన్నో కలివిడిగా వచ్చినా,
    అలసట లేని మలయ సమీరం
    మన సుకుమారం మన "కుమారం"
  • నాడానాడు ఎవడూ లేడు
    ఒకడే వాడు ఆ భీష్ముడు
    నేడీనాడు ఎపుడూ తోడు, మనకున్నాడు ఈ "భీక్ష్ముడు"
  • మనిషి కోమలం మనసొక కమలం,
    ఉంటే తన కరవాలం కదలిరాదా ఆబాల "గోపాలం"
  • మనమయిపోమా పరవశం అతడే ఉంటే ప్రతి నిమిషం
    కఠినపు పనులు సులువుగా చేశాం,అంతా ఆ స్వ"రూపేశం"
  • రాజువై మంత్రివై గడిగాడినా ప్రతిగడినా
    అడుగడుగునా తను ఉంటానంటూ
    సాగే నిరంతరం మన "రాజశేఖరం"
  • ఉన్నాగానీ పురుషాధికం మరిపించిందీ వనితాధికం
    సందేహమసలే లేదిక వెంటే ఉంటే మన "రాధిక"
  • స్వల్పమే అయినా సహవాసం
    మన యెదలో ఉన్నారు నివాసం
    చేసే సేవలు మనకోసం
    ఎవరో కాదు మన "శ్రీనివాసం"
  • ఏ నిశిలోనైనా ఆ శశిలా ఆ నిశికే వెలుగులు తెచ్చేలా
    ప్రతి నిశిలో కసి కన్నులు తెరిచే శాంతం "శశికాంతం"
  • చూస్తూ ఉంటే నయనానందం మాటలు వింటే శ్రవణానందం
    ఓర్పుకు నేర్పుకు అతడే అందం, అపరానందం మన "ఆనందం"
  • ఎవరితో ఎరుగదు ఏ విరోధం చూసామో లేదో తన క్రోధం
    అందుకేనేమో ఈ "అనురాధ"పు అనురాగం
  • మెదడుల్లోని కలితీ తీయ
    విజయం వెంట పరుగులు తీయ
    మన కోసం ఏదైనా చేయ
    ఉంటాడయా మన "సాంబయ"
  • విని ఉంటామా వినలేమా వినకున్నా మైమరిచేలా
    హద్దులు లేని వనితా గగనం అయి ఉంటుందీ "ప్రసన్నం"