- చేసిన సేవలు ఎంతో 'అమరం'
ఎవరూ చేరని కీర్తి 'శిఖరం'
మరచిపోదు మిము మా భావితరం
అందుకే మీరొక సంకల్ప "కిశోరం" - సుతిమెత్తగా మది దోచే మృదు 'మురళీ' గానం
మన వెంటే సాగే తన ప్రయాణం
మొదలవుతుంది ఈ జ్ఞాన తృష్ణ
మాతో ఉంటే "మురళీకృష్ణ" - మంచే మనిషిగా పంచే 'జ్ఞానం'
చీకటిలో మినుగురుగా నీవై పయనిస్తే తొలగును 'అజ్ఞానం'
పనిలో ఎరగదు మీనమేషం,
ఆ వీరమేషం మన "రమేషం" - మనిషేమో నడిచొచ్చిన ధైర్యం
మనసేమో అభినందన తీరం
మాటల్లో అనుభవాల సారం
మన మణిహారం "శివ కుమారం" - వెతికినా ఎపుడైనా ఎకడైనా, లేరేమో ఈ ధరియందు
మాట కోమలం మదిలో స్థానం పదిలం
తానే మనకొక వరం, సుమధురం మన "శ్రీధరం" - నిరర్థ సుఖముకి కోతలు పెట్టి
అలసిన మెదడుకి పదునే పెట్టి
దైవిక సారము లోతులు చెప్పే కృష్ణోవచనవశం "సురేశం" - ఎపుడూ అడిగిన చేసే సాయం
తన ఆలోచనలో ఉందొక న్యాయం
కార్యంలో తనే ముందు ఉంటూ లక్ష్యానికంకితం సదా "ఆంజనేయం" - మనసెంతో సుకుమారం మాటేంతో మధురం
అలలెన్నో కలివిడిగా వచ్చినా,
అలసట లేని మలయ సమీరం
మన సుకుమారం మన "కుమారం" - నాడానాడు ఎవడూ లేడు
ఒకడే వాడు ఆ భీష్ముడు
నేడీనాడు ఎపుడూ తోడు, మనకున్నాడు ఈ "భీక్ష్ముడు" - మనిషి కోమలం మనసొక కమలం,
ఉంటే తన కరవాలం కదలిరాదా ఆబాల "గోపాలం" - మనమయిపోమా పరవశం అతడే ఉంటే ప్రతి నిమిషం
కఠినపు పనులు సులువుగా చేశాం,అంతా ఆ స్వ"రూపేశం" - రాజువై మంత్రివై గడిగాడినా ప్రతిగడినా
అడుగడుగునా తను ఉంటానంటూ
సాగే నిరంతరం మన "రాజశేఖరం" - ఉన్నాగానీ పురుషాధికం మరిపించిందీ వనితాధికం
సందేహమసలే లేదిక వెంటే ఉంటే మన "రాధిక" - స్వల్పమే అయినా సహవాసం
మన యెదలో ఉన్నారు నివాసం
చేసే సేవలు మనకోసం
ఎవరో కాదు మన "శ్రీనివాసం" - ఏ నిశిలోనైనా ఆ శశిలా ఆ నిశికే వెలుగులు తెచ్చేలా
ప్రతి నిశిలో కసి కన్నులు తెరిచే శాంతం "శశికాంతం" - చూస్తూ ఉంటే నయనానందం మాటలు వింటే శ్రవణానందం
ఓర్పుకు నేర్పుకు అతడే అందం, అపరానందం మన "ఆనందం" - ఎవరితో ఎరుగదు ఏ విరోధం చూసామో లేదో తన క్రోధం
అందుకేనేమో ఈ "అనురాధ"పు అనురాగం - మెదడుల్లోని కలితీ తీయ
విజయం వెంట పరుగులు తీయ
మన కోసం ఏదైనా చేయ
ఉంటాడయా మన "సాంబయ" - విని ఉంటామా వినలేమా వినకున్నా మైమరిచేలా
హద్దులు లేని వనితా గగనం అయి ఉంటుందీ "ప్రసన్నం"
Friday, September 24, 2010
Poetry by Praveen Kumar
Subscribe to:
Posts (Atom)